: డేటింగ్ తొలినాడే అమ్మడు చేతివాటం చూపించింది!


అమెరికాలోని ఓరెగాన్ లో ఓ వ్యక్తి ఆన్ లైన్ లో పరిచయమైన అమ్మాయితో డేటింగ్ కు సిద్ధమయ్యాడు. అనుకున్నదే తడవుగా ఆమెను కలిసి విల్సన్ విల్లేలో డేటింగ్ మొదలుపెట్టాడు. అయితే, ఆమె మొదటిరోజే అతడికి షాకిచ్చింది. ఆ రోజు ఇద్దరూ కలిసి కారులో షికార్లు చేయడంతోపాటు రెస్టారెంట్లకూ తిరిగారు. ఇంతలో, ఆ అమ్మాయి కాస్తా అతడి వాలెట్ ను లాక్కొని కార్లోంచి దూకి, పరారైంది. దీంతో, మనవాడు హతాశుడయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె సెల్ ఫోన్ నెంబర్ ను పోలీసులకిచ్చాడు. ఆ నెంబర్ కు కాల్ చేసిన పోలీసులు, అదే రెస్టారెంటుకు పిలిచారామెను. ఎవరో పిలిచారనుకుని వచ్చిన ఆ యువతికి అరదండాలు వేశారు ఓరెగాన్ పోలీసులు. ఏమైతేనేం, అతడి వాలెట్ అతడికి దక్కింది.

  • Loading...

More Telugu News