: సభ్యులను సస్పెండ్ చేయడం నాకూ బాధగానే ఉంది: కేసీఆర్


సభలో అన్ని విషయాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి చెప్పారు. సభను సజావుగా సాగనివ్వాలని పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ టీడీపీ సభ్యులు వినలేదని... గందరగోళం సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేవలం సభను అడ్డుకోవడానికే టీడీపీ సభ్యులు సభకు వచ్చారని ఆరోపించారు. సభ జరిగితే ఏపీ ప్రభుత్వ కుట్రలు బయటపడతాయనేది టీడీపీ ఎమ్మెల్యేల భయమని వ్యాఖ్యానించారు. విధిలేని పరిస్థితుల్లోనే వారిని సస్పెండ్ చేయడం జరిగిందని... సభ సజావుగా సాగాలంటే సప్పెన్షన్ మినహా మరో మార్గం లేకపోయిందని చెప్పారు. బడ్జెట్ పై చర్చ పూర్తయిన తర్వాత మిగిలిన అన్ని అంశాలపై చర్చిద్దామని తెలిపారు.

  • Loading...

More Telugu News