: వారణాసిలో మోదీ పర్యటన ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరుపుతున్న రెండు రోజుల పర్యటన కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి నేరుగా వారణాసి చేరుకున్న ప్రధాని మోదీకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్వాగతం పలికారు. నగరంలోని బదా లాల్ పూర్ లో చేనేత ఉత్పత్తుల వాణిజ్య కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రం ఏర్పాటు కోసం రానున్న రెండేళ్లలోనే రూ.147 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జౌళి శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్ ఈ సందర్భంగా చెప్పారు.