: బండారు దత్తాత్రేయ మళ్లీ కేంద్ర కేబినెట్ లోకి!
సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ రెండోమారు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదివరకు వాజ్ పేయి మంత్రివర్గంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా కొనసాగారు. తాజాగా సికింద్రాబాద్ నుంచి దత్తన్న గెలవడంతో పాటు బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. తొలి దఫాలోనే దత్తన్నకు మంత్రి పదవి అందినట్లే అంది చేజారిందట. అయితే ఆదివారం జరగనున్న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మాత్రం దత్తన్నకు తప్పనిసరిగా బెర్తు లభిస్తుందని అటు పార్టీ వర్గాలతో పాటు, ఇటు ఆయన అభిమానులు కూడా ధీమాగా ఉన్నారు. వయసు మీద పడ్డ నేపథ్యంలో కేబినెట్ హోదా రానప్పటికీ, సహాయ మంత్రి పదవి ఖాయమన్న వాదన వినిపిస్తోంది.