: ఇక తట్టా బుట్టా సర్దేస్తున్న సోనియా అల్లుడు వాద్రా!
కాంగ్రెస్ పార్టీకే కాదు, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబానికి కూడా ఇది గడ్డుకాలమే. పదేళ్ల పాటు అధికారం చెలాయించిన ఆ పార్టీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. సోనియా గాంధీతో పాటు ఆమె కొడుకు రాహుల్, కుమార్తె భర్త రాబర్ట్ వాద్రాలు కూడా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. మొన్నటికి మొన్న తనపై ప్రశ్నలు సంధించిన మీడియా ప్రతినిధులపై వాద్రా దురుసుగానూ వ్యవహరించి విమర్శలపాలయ్యారు. ఇక లాభం లేదనుకున్నాడో, ఏమో బీజేపీ పాలనాపగ్గాలు చేపట్టిన హర్యానా, రాజస్థాన్ లలో వాద్రా తన వ్యాపార సామ్రాజ్యాన్ని అటకెక్కించేస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న తన ఆరు కంపెనీలను మూసేసేందుకు వాద్రా సన్నాహాలు చేస్తున్నారని ఓ ఆంగ్ల దినపత్రిక తెలిపింది. సదరు కంపెనీలు మూతపడినట్లుగా కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ధారించినట్లు సమాచారం.