: జమ్మూ, లడఖ్ లలో బీజేపీకి మెజారిటీ రావచ్చు: ఒమర్ అబ్దుల్లా


బీజేపీ ప్రచార వ్యూహం, నరేంద్ర మోదీ ప్రభావం, పీడీపీ సహకారంతో జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే జమ్మూ ప్రాంతం, బౌద్ధులు మెజారిటీ సంఖ్యలో ఉండే లడఖ్ ప్రాంతాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు వల్ల తమ పార్టీ చాలా నష్టపోయిందని అన్నారు. తన తండ్రి ఫరూక్ అబ్దుల్లా అనారోగ్యం కారణంగా ఎన్నికల ప్రచారం చేయలేని స్థితిలో ఉన్నారని... మొత్తం 87 నియోజకవర్గాలను తానే చూసుకుంటానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News