: జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 4 వేల లోపు ఆస్తిపన్ను మాఫీ
జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 4 వేల లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికి శుభవార్త. 4 వేల లోపు ఆస్తిపన్నును మాఫీ చేయాలని జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో, గ్రేటర్ పరిధిలోని దాదాపు 10 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయంతో, జీహెచ్ఎంసీపై రూ. 120 కోట్ల వరకు భారం పడనుంది.