: మా కుటుంబానికి ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అఖిలప్రియ


అనుక్షణం ప్రజల కోసమే పని చేస్తున్న తన తండ్రి భూమా నాగిరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి, రౌడీ షీట్ ఓపెన్ చేశారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. తమ కుటుంబానికి ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం జరుగుతున్నప్పుడు, 'డోర్లు వేయండిరా' అన్న ఒక్క మాటకే తన తండ్రిపై కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చట్టం ప్రకారం ఎమ్మెల్యేకు మాట్లాడే హక్కు ఉంటుందని చెప్పారు. న్యాయవ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని... నాన్న క్లీన్ చిట్ తో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత, సరైన విచారణ చేయకుండా కేసులు పెట్టిన పోలీసుల మీద కూడా న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News