: భూమాకు జగన్ పరామర్శ
అనారోగ్యానికి గురై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. భూమా ఆరోగ్య పరిస్థితిపై ఆయన వైద్యులను ఆరా తీశారు. నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన గొడవ నేపథ్యంలో భూమాను పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యానికి గురైన భూమాకు మెరుగైన వైద్యం అందించేందుకు కోర్టు సూచనపై పోలీసులు నిమ్స్ కు తరలించారు.