: విదర్భను వేరుచేయడమంటే తల్లీబిడ్డలను విడదీయటం లాంటిదే: శివసేన
మహారాష్ట్ర నుంచి విదర్భను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా చేస్తామన్న బీజేపీ వైఖరిని "రక్షకులే హంతకులుగా మారారు" అన్న మాటలతో శివసేన పోల్చింది. మాజీ సంకీర్ణ పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేసిన సేన, అభివృద్ధి కోసం ఓటు వేశారు కానీ, ప్రత్యేక రాష్ట్రంగా చేసేందుకు కాదని పేర్కొంది. "ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విదర్భలో బీజేపీ మంచి విజయం సాధించింది. అయితే, మహారాష్ట్రను విభజించడానికి వారికీ ఈ అధికారం వచ్చిందని ఆలోచించకూడదు. మహారాష్ట్ర నుంచి విదర్భను విడదీయడమంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమే" అని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో సూచించింది. ప్రస్తుతం ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించాలని చెప్పింది.