: తెలంగాణ బడ్జెట్ వివరాలు - 1
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవే... * మొత్తం బడ్జెట్ రూ. లక్షా 637 కోట్లు. * ప్రణాళికా వ్యయం రూ. 48, 648 కోట్లు. * ప్రణాళికేతర వ్యయం రూ. 51,989 కోట్లు. * రెవెన్యూ మిగులు రూ. 301 కోట్లు. * రైతుల రుణమాఫీ కోసం రూ. 4250 కోట్లు. * రైతుల ఇన్ పుట్ సబ్సిడీ కోసం రూ. 480.43 కోట్లు చెల్లించాం. * అమరవీరుల కుటుంబాలకు రూ. 100 కోట్లు. * నీటిపారుదల రంగానికి రూ. 6,500 కోట్లు * 9వేల చెరువుల మరమ్మతులకు రూ. 2 వేల కోట్లు. ఐదేళ్లలో 40 వేల చెరువులను పునరుద్ధరిస్తాం. * మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం. * రక్షిత మంచినీటికి రూ. 2 వేల కోట్లు. * కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా. కోళ్ల పరిశ్రమకు కరెంట్ సబ్సిడీ రూ. 25 కోట్లు. * వాటర్ గ్రిడ్ కు రూ. 2 వేల కోట్లు. * సాంస్కృతిక, టూరిజం, క్రీడలకు రూ. 1000 కోట్లు. * ఒక్కో చేనేత కుటుంబానికి లక్షన్నర పరిహారం. * చేనేత కార్మికుల కుటుంబానికి రూ. లక్ష రుణమాఫీ. * జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 10 కోట్లు. * అడ్వొకేట్ల సంక్షేమానికి రూ. 100 కోట్లు. * గృహ నిర్మాణాలకు రూ. 1000 కోట్లు. * ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ. 1.50 కోట్లు. * ఫారెస్ట్ కాలేజీలకు రూ. 10 కోట్లు. * తిరుమల తరహాలో యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ. 100 కోట్లు.