: కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ
ఈ ఉదయం 10 గంటలకు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. శాసనసభ కమిటీ హాల్ లో జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదముద్ర వేస్తారు. అనంతరం, శాసనసభలో టీఎస్ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి రాజయ్య బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇప్పటికే ఆర్థికమంత్రి ఈటెల అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ఈటెలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆహ్వానం పలికారు.