: నవ్యాంధ్రలో అపార అవకాశాలు: చంద్రబాబు
నవ్యాంధ్రప్రదేశ్ లో అపార అవకాశాలున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం బెంగళూరు పర్యటనలో భాగంగా న్యూటనిక్స్ కంపెనీని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అంతేకాక రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.