: కేసీఆర్ తిట్లతోనే కాలక్షేపం చేస్తున్నారు: కిషన్ రెడ్డి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పలు విషయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్ ఎప్పుడూ తిట్లతోనే కాలక్షేపం చేస్తున్నారన్నారు. తిట్ల పురాణాలతో ఇతరులను విమర్శించడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. మాటల గారడీతో కాలక్షేపం చేయవద్దని సూచించారు. ఈ మేరకు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదని ప్రశ్నించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంత్యోత్సవం నిర్వహించమని ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శలు చేశారని తెలిపారు. ఇక రాష్ట్రంలో రేషన్, పింఛన్, ఆహార భద్రత కార్డుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచిన తనకే వాటి గురించి సరైన అవగాహన లేదని చెప్పారు. కాబట్టి, ఎందుకు కార్డులు ఇస్తున్నారో, ఏ నిబంధనల మేరకు తిరస్కరిస్తున్నారో ప్రజలకు చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News