: బంగారు తెలంగాణ రాలేదు... బాధల తెలంగాణ వచ్చింది: పొన్నాల


టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బంగారు తెలంగాణ సంగతేమో కానీ... బాధల తెలంగాణ మాత్రం వచ్చిందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే తెలంగాణకు అతి పెద్ద సమస్య అని అన్నారు. బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటానన్న కేసీఆర్... చంద్రబాబుతో మాట్లాడి విద్యుత్ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. దక్షిణాది ముఖ్యమంత్రుల మండలిలో ఉన్న కేసీఆర్ మిగిలిన సీఎంలతో మాట్లాడి చంద్రబాబుపై ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నారని నిలదీశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. విభజన చట్టం తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పటికీ... దాన్నుంచి లబ్ధి పొందడంలో కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు.

  • Loading...

More Telugu News