: ఐసీసీ ఆల్ రౌండర్ల జాబితాలో అశ్వినే టాప్


టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మేరకు ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అశ్విన్ తర్వాత రెండోస్థానంలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ వెర్నాన్ ఫిలాండర్ ఉన్నాడు. బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీబ్ అల్ హసన్ మూడోస్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకుల్లో లంక దిగ్గజం కుమార సంగక్కర ప్రథమస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ యోధుడు ఏబీ డీవిలియర్స్ ఉన్నాడు. బ్యాటింగ్ టాప్-10లో భారత బ్యాట్స్ మన్ ఒక్కరూ లేరు. బౌలింగ్ జాబితాలోనూ అంతే! అశ్విన్ 12వ స్థానంలో ఉన్నాడు. కాగా, ఆసీస్ తో తటస్థ వేదికపై జరిగిన టెస్టు సిరీస్ లో విశేషంగా రాణించిన పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ యూనస్ ఖాన్, మిస్బావుల్ హక్ టాప్ టెన్ కు ఎగబాకారు.

  • Loading...

More Telugu News