: విద్యుత్ ఒప్పందం కుదిరినా... తెలంగాణలో రబీకి కష్టాలే!
తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చే క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన యత్నాలు తక్షణ ఉపశమనాన్ని ఇవ్వలేకపోతున్నాయి. రెండు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ వెళ్లిన కేసీఆర్, వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే సదరు ఒప్పందంలో పేర్కొన్న విద్యుత్ ఇప్పటికిప్పుడు అందే అవకాశాలు లేవు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు నేరుగా విద్యుత్ లైన్ లేకపోవడం, కొనుగోలు ధరలు ఖరారు కాకపోవడం కూడా ఇందుకు అవరోధాలుగా నిలుస్తున్నాయని తెలంగాణ ట్రాన్స్ కో అధికారులు చెబుతున్నారు. అవరోధాలన్నీ తొలగేందుకు కనీసం రెండు నెలల సమయమైనా పడుతుందన్నది వారి వాదన. దీంతో ఖరీఫ్ లో నానా ఇబ్బందులకు గురైన తెలంగాణ రైతాంగం రబీలోనూ విపత్కర పరిస్థితి నెలకొంది.