: భూమా నాగిరెడ్డిపై రౌడీ షీట్
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, అతని 13 మంది సహచరులపై రౌడీషీట్ లు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా పరిషత్ లో జరిగిన గొడవ, ఆ తరువాత నెలకొన్న పరిణామాల నేపథ్యంలో భూమాపై రౌడీషీట్ నమోదు చేసినట్టు నంద్యాల పోలీసులు తెలిపారు. కాగా, తనను హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు అనుమతించాలని నంద్యాల కోర్టులో భూమా వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రైవేటు వైద్యులు ఇచ్చే రిపోర్టులను తాము నమ్మమని, ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స పొందాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.