: తెలంగాణ విద్యుదుత్పత్తికి ఏపీ అడ్డు చెబుతోందని చెప్పాం: హరీశ్ రావు


శ్రీశైలం జల విద్యుత్ విషయంలో తెలంగాణకు రావాల్సిన వాటాపై కేంద్ర మంత్రులు ఉమాభారతి, పీయూష్ గోయల్ ను మంత్రి హరీశ్ రావు, టీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. అధికారికంగా తమకు రావల్సిన వాటాను రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుపడుతోందని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు హరీశ్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 2 తరువాత ఉత్పత్తి చేయవద్దని కృష్ణా బోర్డు తీర్పులో లేదని ఉమాభారతికి ఫిర్యాదు చేశామని చెప్పారు. విద్యుదుత్పత్తి విషయంలో కృష్ణా బోర్డుకు మూడుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. నీటి కేటాయింపులు లేని హంద్రీ నీవాకు కూడా ఇప్పటికీ సరఫరా చేస్తున్నారని ఫిర్యాదు చేశామని హరీశ్ వెల్లడించారు. దీనికి స్పందించిన ఉమాభారతి తెలంగాణ రైతులకు ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. అటు మంత్రి పీయూష్ గోయల్ ను కలసి, పవర్ విషయంలో ఏపీ ప్రభుత్వం విభజన చట్టం ఎలా ఉల్లంఘిస్తోందో వివరించామన్నారు.

  • Loading...

More Telugu News