: స్మార్ట్ ఫోన్ వాడుక పరిమితం చేసేందుకు యాప్
స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారా? అయితే, మీ కోసమే ఈ సరికొత్త యాప్. దీనిపేరు 'ఆఫ్ టైమ్'. ఈ యాప్ స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. మీరేదైనా ముఖ్యమైన పనిపై దృష్టి పెట్టే సమయంలో, ఇది స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లను, ఇతర అప్లికేషన్లను నియంత్రిస్తుంది. అత్యవసరమైతే తప్ప ఇతరులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేరు. బెర్లిన్ కు చెందిన సైకాలజిస్ట్ అలెగ్జాండర్ స్టీన్ హార్ట్ ఈ 'ఆఫ్ టైమ్' ను అభివృద్ధి చేశాడు. బాగా సన్నిహితులు, కావాల్సిన వాళ్ల సమక్షంలో ఉన్నారనుకోండి... వెంటనే, నోటిఫికేషన్లు, ఇతర యాప్స్ ను నిలువరిస్తుందీ యాప్. దీంతో, పదేపదే ఫోన్ ను చూసుకోవాల్సిన అవసరం ఉండదు.