: తన ప్రేమ నిరూపించుకోవడానికి యువతి దుస్సాహసం
నమ్మకం లేని ప్రేమ ఎలాంటి పర్యవసానాలకు కారణమవుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో సోనాక్షీ గౌతమ్ అనే అమ్మాయి మరో కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడింది. వీరి అనుబంధాన్ని అమ్మాయి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అటు, ప్రియుడు కూడా అనుమానించసాగాడు. తన పట్ల ప్రేమను నిరూపించుకోవాలని సోనాక్షిని కోరాడు. దీంతో, ఆ అమాయకురాలు మరేమీ ఆలోచించకుండా ఓ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకేసింది. అయితే, అంతెత్తునుంచి దూకినా ఆశ్చర్యకరంగా ఆమెకు ప్రాణహాని జరగలేదు. గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంటోంది.