: యూట్యూట్ లో ‘జిద్‘ చిత్రం ట్రైలర్ కు రికార్డు హిట్లు!


బాలీవుడ్ కథానాయకి ప్రియాంకా చోప్రా సమీప బంధువు (కజిన్ సిస్టర్) మనారా అలియాస్ బార్బీ హందా నటించిన చిత్రం ‘జిద్’ ట్రైలర్ కు యూట్యూబ్ లో హిట్లు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 29న విడుదలైన ఈ ట్రైలర్ కు ఆదివారం సాయంత్రానికే 13.7 లక్షల హిట్లు నమోదయ్యాయి. భారత సినీ చరిత్రలో విడుదలకు ముందే ఈ మేర ఆసక్తి కలిగించిన తొలి చిత్రంగా జిద్ రికార్డు నమోదు చేసింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనారా అందాలను ఓ రేంజిలో ఆరబోశారు. ఇదిలా ఉంటే, తన అనుమతి లేకుండా ట్రైలర్ లో అభ్యంతరకర సన్నివేశాలు చొప్పించారని ఆరోపిస్తూ, దర్శకుడు వివేక్ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News