: ఆక్రమణలు తొలగిస్తాం: ఏపీ మంత్రి నారాయణ


ఆంధ్రప్రదేశ్ లోని అన్ని చోట్లా ఆక్రమణలు తొలగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ ను పొదుపు చేయాలని సూచించారు. ఎల్ఈడీ దీపాల వినియోగంతో 50 శాతం విద్యుత్ ఆదా అవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఎల్ఈడీ విద్యుత్ దీపాలు అందజేసేందుకు కేంద్రం అంగీకరించిందని ఆయన వివరించారు. ప్రతి ఇంట్లో ఎల్ఈడీ లైట్లు ఉంటే కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News