: హైదరాబాదులో దారుణం...మత్తిచ్చి అత్యాచారం చేశారు
అత్యాచారాలు ఆగడం లేదు... వివేకవంతులుగా భావించే విద్యావంతులు కూడా అత్యాచారాలకు పాల్పడి సభ్యసమాజంలో మహిళా రక్షణకు సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని ఇఫ్లూలో దారుణం వెలుగుచూసింది. ఉస్మానియా యూనివర్సిటీ వద్ద గల ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో సహ విద్యార్థులు తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ విద్యార్థిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన ఉస్మానియా పోలీసులు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.