: అడకత్తెరలో బీజేపీ అగ్రనాయకత్వం


బీజేపీ ప్రధాని అభ్యర్థి విషయంలో కొన్నాళ్ళ క్రితం వరకు కిమ్మనకుండా ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ స్వరం పెంచుతున్నాయి. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే, తాము ఎన్డీయే నుంచి వైదొలుగుతామని జేడీ (యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్ అంటోండగా.. బీజేపీ తన ప్రధాని అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించాలని శివసేన డిమాండ్ చేస్తోంది. దీంతో, బీజేపీ పని అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది!

అనర్హుడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే స్నేహబంధం విచ్ఛిన్నమవడం తథ్యమని శివసేన తన 'సామ్నా' పత్రికలో పేర్కొంది. అంతేగాకుండా, పరోక్షంగా మోడీకి మద్దతుగా పలు వ్యాఖ్యలు చేసింది. గుజరాత్ అల్లర్ల సమయంలో ముస్లింలపై జరిగిన ఊచకోత సంఘటనలు, మోడీ స్థానంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, చోటు చేసుకుని ఉండేవని అభిప్రాయపడింది. ఈ అల్లర్ల విషయమై నిన్న నితీశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందని మోడీపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News