: బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా
శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. కటక్ లోని బారాబతి స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. కాగా, మహేంద్ర సింగ్ ధోనీ గైర్హాజరీలో జరుగుతున్న ఈ వన్డే సిరీస్ లో టీమిండియాకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు. ధావన్ (5) రహానే (2) ఆడుతున్నారు. దమ్మక ప్రసాద్ బౌలింగ్ దాడిని ఆరంభించాడు. తొలి ఓవర్ లో టీమిండియా 9 పరుగులు పిండుకుంది.