: కెప్టెన్ గా విఫలమైనప్పుడు...క్రికెట్ నుంచే తప్పకుందామనుకున్నా: సచిన్


టీమిండియా కెప్టెన్ గా ఘోరంగా విఫలమైన సందర్భంగా ఏకంగా క్రికెట్ నుంచే తప్పుకుందామని భావించానని క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. సుదీర్ఘ కెరీర్ లో అన్ని రకాల రికార్డులను తన పేరిట లిఖించుకున్న సచిన్, ఎన్నడూ తాను ఎదుర్కొన్న ఇబ్బందులను బయట పెట్టలేదు. తాజాగా ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పేరిట సచిన్ రాసిన తన ఆటోబయోగ్రఫీ ఈ నెల 6న విశ్వవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పుస్తకంలో తన విజయాలతో పాటు తన పరాభవాలను కూడా సచిన్ నెమరువేసుకున్నాడు. కెప్టెన్ గా కొనసాగిన సమయంలో సచిన్ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కెప్టెన్ గా ఆకట్టుకోని సచిన్, నాడు బ్యాటింగ్ లోనూ పేలవ ఫాంను ప్రదర్శించాడు. దీంతో ఏకంగా క్రికెట్ నుంచే తప్పుకుంటే మంచిదని అతడు భావించాడట. ‘కెప్టెన్ గా విఫలమయ్యాను. నా నేతృత్వంలో టీమిండియా పరాజయాల బాట పట్టింది. అందులో నుంచి జట్టును ఎలా బయటపడేయాలో అర్థం కాలేదు. నా భార్య అంజలి సముదాయించినా ఆ షాక్ లో నుంచి కోలుకోలేకపోయాను’ అంటూ నాటి చేదు జ్ఞాపకాలను సచిన్ నెమరువేసుకున్నాడు. ఈ పుస్తకాన్ని ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్, చరిత్రకారుడు బోరియ మజుందార్ తో కలిసి సచిన్ రాశాడు.

  • Loading...

More Telugu News