: స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో జియోమీకి మూడో స్థానం


చైనా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ జియోమీ అనతికాలంలోనే దిగ్గజ కంపెనీలకు సవాల్ విసిరే స్థాయికి చేరింది. కేవలం మూడేళ్ల కాల వ్యవధిలోనే ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో మూడో అతి పెద్ద సంస్థగా అవతరించింది. తొలి స్థానంలో శ్యాంసంగ్ ఉండగా, రెండో స్థానంలో యాపిల్ కొనసాగుతోంది. జియోమీ ఫోన్లు భారత మార్కెట్ లో నిషేధానికి గురైనా, ఇతర దేశాల్లో ఈ ఫోన్లకు భారీ గిరాకీ ఉంది. ఆన్ లైన్ విక్రయాల ద్వారా నేరుగా వినియోగదారులకు అందుతూ, ఈ కంపెనీ ఫోన్లు కొత్తరకం విక్రయాలకు తెరలేపాయి. ఇదిలా ఉంటే, అతి తక్కువ ధరకే లభ్యమవుతున్న జియోమీ ఫోన్లతో అటు శ్యాంసంగ్, యాపిల్ ఫోన్ల విక్రయ వాటాలు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. రానున్న రెండేళ్లలో జియోమీ తొలిస్థానంలో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

  • Loading...

More Telugu News