: వాళ్లిద్దరి బంధంలోకి నన్ను లాగవద్దు... రానాతో సంబంధం లేదు: రాగిణి
టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటితో తాను డేటింగ్ చేయడం లేదని కన్నడ నటి రాగిణి ద్వివేది ట్వీట్ చేశారు. తాను మంచి ప్రొఫెషన్ లో సంతోషంగా ఉన్నానని, సిల్లీ రూమర్లను సృష్టించడం మానేయాలని ఆమె ట్వీట్ లో కోరారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, రానా అఫైర్ బ్రేక్ కావడానికి తాను కారణం కాదని అన్నారు. ఇలాంటి రూమర్లు ఎలా పుడతాయో తెలియదని ఆమె పేర్కొన్నారు. రానా అఫైర్ వ్యవహారంలోకి తనను లాగవద్దని రాగిణి రిక్వెస్ట్ చేశారు.