: భూమాకు 15 రోజుల రిమాండ్


వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి నంద్యాల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ 15 రోజుల రిమాండ్ విధించారు. నంద్యాల మునిసిపల్ కార్యాలయంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై హత్యాయత్నం సహా మూడు కేసులను పోలీసులు నమోదు చేశారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన ఎక్కడ ఉన్నా లొంగిపోవాలని, ప్రజాస్వామ్యంలో తప్పించుకోవడం జరగదని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో, చట్టాన్ని గౌరవించి తాను లొంగిపోతున్నానని, ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం పోరాటంలో లొంగిపోతున్నానని పేర్కొని ఆయన ఎస్పీ ఎదుట లొంగిపోయారు. దీంతో ఆయనను నంద్యాలలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. భూమాకు అనారోగ్యంగా ఉందని, ఆయనను అరెస్టు నుంచి తప్పించాలని ఆయన తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News