: రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి: కేసీఆర్
తెలంగాణ రైతులు ప్రభుత్వానికి సహకరించాలని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వర్షాభావం, విద్యుత్ సంక్షోభం వంటి సమస్యల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని అన్నారు. ఏపీ ప్రభుత్వం సరఫరా చేయాల్సిన 54 శాతం విద్యుత్ ను ఇవ్వడం లేదని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని వెల్లడించారు.