: కిషన్ రెడ్డి భార్య సంతకాన్ని ఫోర్జరీ చేసి లక్షలు కొట్టేయబోయాడు!


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భార్య కావ్య సంతకాన్ని ఫోర్జరీ చేశాడో ప్రబుద్ధుడు. అంతేకాదు, బ్యాంకుకు వెళ్లి రూ. 10 లక్షలు కాజేయడానికి ప్రయత్నించాడు. హైదరాబాద్ పంజగుట్టలోని ఆంధ్రాబ్యాంకులో ఉన్న కావ్య అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తుండగా... బ్యాంక్ మేనేజర్ వెంటనే కిషన్ రెడ్డికి ఫోన్ చేసి చెక్కు గురించి అడిగారు. ఈ విషయం గురించి కిషన్ రెడ్డి తన భార్యను వాకబు చేయగా.... ఎలాంటి చెక్ తాను ఇవ్వలేదని ఆమె సమాధానం ఇచ్చారు. ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్ కు కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో, పోలీసులకు బ్యాంక్ మేనేజర్ సమాచారం అందించగా... వారు వచ్చి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News