: మన్యంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు... లంబసింగిలో 10 డిగ్రీలు
ప్రకృతి అందాలకు నెలవైన మన్యంలో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. శుక్రవారం రాత్రి లంబసింగిలో 10 డిగ్రీలు, చింతపల్లిలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత అధికంగా ఉండటంతో పాటు పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. చింతపల్లి, అరకు, పాడేరు ప్రాంతాల్లో సూర్యోదయం కూడా ఆలస్యంగా అవుతోంది. ఉదయం 9 గంటల వరకు కూడా మంచు తెరలు తొలగిపోవడం లేదు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.