: తాపేశ్వరం లడ్డూ నాలుగోసారి గిన్నిస్ కెక్కింది


స్వీట్స్ లో తాపేశ్వరం లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే తాపేశ్వరానికి చెందిన భక్తాంజనేయ స్వీట్స్ లడ్డూకు మరింత ప్రత్యేకత ఉంది. వారు తయారు చేసిన లడ్డూను ప్రతి ఏటా ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో పెట్టడం ఆనవాయతీ. ఈ తాపేశ్వరం లడ్డూ 2011 నుంచి ప్రతి ఏటా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంటూ వస్తోంది. ప్రతి ఏటా తాను నిర్థారించిన పరిమాణాన్ని తానే అధిగమిస్తూ ఇప్పుడు నాలుగోసారి రికార్డు పుటలకెక్కింది.

  • Loading...

More Telugu News