: పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. లీటరు పెట్రోలుపై 2.41 రూపాయలు, లీటరు డీజిల్పై 2.25 రూపాయల చొప్పున తగ్గించినట్టు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోలు, డీజిల్ ధరలు గత రెండు నెలల్లో ఆరు సార్లు తగ్గాయి. తగ్గిన ధరలను నేటి అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నారు. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోలు ధర 72 రూపాయలకు చేరుకోనుంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ధరలు దిగిరావడం, చమురు ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో ఇంధన ధరలు తగ్గాయి.