: పుట్టిన రోజు, పెళ్లి రోజు మానేసి విడాకుల రోజు జరుపుకుంటారా?: చలసాని శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ తీరు పుట్టిన రోజు, పెళ్లి రోజు మానేసి విడాకుల రోజును పండగలా చేసుకుంటానన్నట్టుందని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఓ టీవీ డిస్కషన్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన వద్దు బాబోయ్ అని ప్రజలు నెత్తీనోరు బాదుకున్నప్పటికీ విభజించిన రోజును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా పండుగలా చేసుకోగలరని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అక్టోబర్ 1న ఏర్పాటు చేస్తే, నవంబర్ 1న మధ్యలో తెలంగాణ కలవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవంగా మారిందని, బలవంతంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన జూన్ 2న ఎలా రాష్ట్ర అవతరణ దినోత్సవం అవుతుందో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలు వాస్తవ కోణంలో ఆలోచించడం మానేశారని, తెలంగాణలో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు జూన్ 2 రాష్ట్రావతరణ దినోత్సవం అని టీడీపీ నేతలు అంటున్నారని ఆయన మండిపడ్డారు.