: ఏపీలోని 7 నగరాల్లో 485 కొత్త బస్సులు
ఆంధ్రప్రదేశ్ లోని 7 నగరాలకు కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నారు. జేఎన్ఎన్ యూఆర్ఎం పథకం కింద 178.33 కోట్ల రూపాయలతో బస్సులు కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొనుగోలులో కేంద్రం 114.79 కోట్ల రూపాయలు, రాష్ట్రం 40.17 కోట్ల రూపాయలు, ఆర్టీసీ 23.37 కోట్ల చొప్పున భరించనున్నాయి. తిరుపతికి 120 బస్సులు, విశాఖకు 105 బస్సులు, విజయవాడకు 90, గుంటూరుకు 60, కడప, అనంతపురంకు చెరో 40, చిత్తూరుకు 30 బస్సులను మంజూరు చేశారు. కడప, గుంటూరులో కొత్త డిపోలు ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ రవాణాశాఖ వెల్లడించింది.