: మోదీ నాయకత్వం దేశంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేసింది: అమిత్ షా
ప్రదానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీర్తించారు. ఆయన నాయకత్వం దేశ సామర్ధ్యంపై ప్రజల్లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ విశ్వాసం కలిగేలా చేసిందన్నారు. మధ్యప్రదేశ్ లో స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన 'కార్యకర్త సంకల్ప్ అధివేశన్' కార్యక్రమంలో షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, "గత పదేళ్లుగా దేశ ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. కానీ, మోదీ ప్రధానమంత్రి అయిన నాలుగు నెలల్లోనే దేశ ప్రజలేగాక, ప్రపంచం మొత్తం భారత సమర్థతపై తిరిగి విశ్వసిస్తోంది" అని పేర్కొన్నారు.