: ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఉద్ధవ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే హాజరు కానున్నారు. గత కొన్ని రోజులుగా, ఈ విషయమై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం పీఠం అధిష్ఠించనున్న ఫడ్నవీస్ ఈ మధ్యాహ్నం ఉద్ధవ్ తో మాట్లాడారు. అనంతరం, ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేందుకు శివసేన అధినేత అంగీకరించారు. ఈ సాయంత్రం ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ముంబయిలోని వాంఖెడే క్రికెట్ స్టేడియం ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక.