: లెనోవా చేతుల్లోకి 'మోటారోలా'
గూగుల్ కి చెందిన 'మోటోరోలా' సంస్థను ప్రముఖ చైనీస్ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవా కొనుగోలు చేసింది. 2.9 బిలియన్ డాలర్లకు మోటారోలాను దక్కించుకున్నట్లు తెలిపింది. మోటారోలాను కొనుగోలు చేస్తున్నట్టు జనవరిలోనే ప్రకటన చేయడం స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో ప్రపంచ పోటీదారుగా లెనోవా అవతరించేందుకు తోడ్పడుతుందని భావిస్తున్నట్టు సంస్థ ఛైర్మన్ తెలిపారు. 2012లో గూగుల్ 12.4 బిలియన్ డాలర్లకు 'మోటారోలా మొబిలిటీ'ని తీసుకుంది.