: రూ.115 కోట్లు పెట్టి కుమార్తెకు బంగ్లా కొన్న హెచ్ సీఎల్ ఛైర్మన్


హెచ్ సీఎల్ ఛైర్మన్ శివ్ నాడార్ తన కుమార్తె కోసం ఢిల్లీలోని ఫ్రెండ్స్ కాలనీ తూర్పు ప్రాంతంలో రూ.115 కోట్లు వెచ్చించి ఓ అధునాతన బంగ్లా కొనుగోలు చేశారు. రాజధాని ఢిల్లీ వెలుపల ప్రాంతం లుట్యెన్స్ బంగళా జోన్ లో ఇదే అతిపెద్ద లావాదేవీ అని ఓ ఆర్థికరంగ దినపత్రిక పేర్కొంది. ఈ 1,930 చదరపు గజాల ప్లాట్ ను విశాల భవనంగా తిరిగి నిర్మించారని, తన కుమార్తె, అల్లుడు ఉండేందుకు కావలసిన వాటన్నింటినీ ఆ భవనంలో ఏర్పాటు చేసినట్టు పత్రిక వివరించింది.

  • Loading...

More Telugu News