: హైదరాబాదులో రెచ్చిపోయిన రియల్ మాఫియా... తల్వార్లతో నరికి చంపారు
హైదరాబాదులో రియల్ మాఫియా రెచ్చిపోయింది. బంజారాహిల్స్ లో స్థల యజమాని నయీంఖాన్ ను దారుణంగా హత్య చేశారు. తల్వార్లతో నరికి చంపారు. 600 గజాలకు సంబంధించిన స్థల వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఓ పథకం ప్రకారమే నయీంను హత్య చేశారని ఆయన సోదరుడు సలీంఖాన్ ఆరోపించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.