: 'అంతర్జాతీయ షూటింగ్ ఫెడరేషన్' అథ్లెట్స్ కమిటీ ఛైర్మన్ గా అభినవ్ బింద్రా


ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 'ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్' (ఐఎస్ఎస్ఎఫ్) అథ్లెట్స్ కమిటీ ఛైర్మన్ గా ఎన్నికయ్యాడు. ఐఎస్ఎస్ఎఫ్ ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా వెల్లడించింది. 32 ఏళ్ల బింద్రా ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ షూటర్ గా అవతరించాడు. ఈ క్రమంలో ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ లో అతను సభ్యుడవుతాడు. ఈ సందర్భంగా బింద్రా మాట్లాడుతూ, "నాకే కాకుండా దేశానికి కూడా ఇది గొప్ప గౌరవం. షూటర్ల అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకునేందుకు నాకు ఈ బాధ్యత అప్పగించారు. ఈ క్రమంలో చివరి వరకు న్యాయం చేసేందుకే చూస్తాను" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News