: శివసేన నేతలెవరూ రేపు ప్రమాణం చేయబోరు: బీజేపీ


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారోత్సవంలో శివసేన పార్టీ నేతలెవరూ ప్రమాణం చేసే అవకాశం లేదని బీజేపీ స్పష్టం చేసింది. రేపు ప్రాథమికంగా ప్రకటించే క్యాబినెట్లో శివసేన నేతలకు చోటు కల్పించడం లేదని బీజేపీ జనరల్ సెక్రెటరీ రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. కానీ, ఆ పార్టీతో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మరోవైపు, సేన పార్టీ నుంచి కూడా ప్రమాణస్వీకారానికి హాజరయ్యే విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా, ఎన్ సీపీ బయటినుంచి ఇస్తామన్న మద్దతును మహారాష్ట్ర అభివృద్ధి కోసం పరిశీలిస్తున్నామన్నట్లు రూడీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News