: డేరా బాబాను అభినందించిన ప్రధాని మోదీ


తన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అభియాన్ లో పాల్గొంటున్న ప్రముఖులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రముఖ మత గురువు, డేరా బాబాగా ప్రసిద్ధికెక్కిన రామ్ రహీం సింగ్ ను కూడా అభినందించారు. రామ్ రహీం తన భక్తులతో కలసి చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఇలాంటి వ్యక్తులు ముందుకురావడం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు చైతన్యవంతులవుతారని మోదీ ట్వీట్ చేశారు. అటు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, భారత హాకీ కెప్టెన్ సర్దారా సింగ్ లను కూడా మోదీ అభినందించారు.

  • Loading...

More Telugu News