: మా అమ్మ నన్ను పెళ్లి కూతురుగా చూడాలనుకుంటోంది: ప్రియాంక చోప్రా


బాలీవుడ్ లో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న అందాల భామ ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకోవాల్సిన కథానాయికల జాబితాలో ముందుంటుంది. ఈ విషయంపై అరుదుగా మాట్లాడే అమ్మడు, తను వివాహం చేసుకోవాలని తన తల్లి కోరుకుంటోందని తెలిపింది. "నన్ను పెళ్లి కూతురుగా చూడాలని మా అమ్మ ఆశపడుతోంది. విశేషం ఏమిటంటే, నాకు నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచే తనలా అనుకుంటోంది" అని నవ్వుతూ చెప్పింది. అయితే, పెళ్లనేది చాలా తేలికగా తీసుకునే విషయం కాదని, జీవితంలో చాలా ముఖ్యమైన అంశమని పీీసీ అంటోంది. తానొక్కతే తన జీవితంలో ఉన్న అమ్మాయిననే భావన కలిగించే వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా వివాహం చేసుకోవాలని వివరించింది.

  • Loading...

More Telugu News