: జూడాల సమ్మెపై తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు


సెప్టెంబర్ 29 నుంచి కొనసాగుతున్న హైదరాబాదులోని జూనియర్ వైద్యుల సమ్మెపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ అంశంపై తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. మరికాసేపట్లో తీర్పు వెలువడుతుందని సమాచారం. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో, జూడాలు చేసిన ఐదు డిమాండ్లలో నాలుగు డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుందని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఇందుకు సంబంధించి జీవో కూడా జారీ చేసినట్లు కోర్టుకు వివరించారు. అటు వైద్యుల తరపు వాదనల్లో, ప్రజల కోసమే తాము సమ్మె చేస్తున్నామన్నారు. స్వప్రయోజనాల కోసం సమ్మె చేయడం లేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News