: వైట్ హౌస్ కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడ్డారు
కంప్యూటర్ హ్యాకర్లు అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధాన్ని కూడా వదల్లేదు. శ్వేతసౌధంలోని కంప్యూటర్ వ్యవస్థలోకి హ్యాకర్లు చొరబడినట్టు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. హ్యాకింగ్ కారణంగా వైట్ హౌస్ లో తాత్కాలికంగా పలు సేవలు స్తంభించినట్టు వెల్లడించింది. ఈ చొరబాటు వెనుక రష్యా ప్రభుత్వ హస్తముందని అమెరికా అనుమానిస్తోందని ఆ పత్రిక వివరించింది. హ్యాకింగ్ జరిగిన విషయాన్ని గుర్తించిన వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు ఆ పత్రిక పేర్కొంది. హ్యాకింగ్ వల్ల అధ్యక్ష భవనంలో కంప్యూటర్ వ్యవస్థకు ఎటువంటి నష్టం కలగలేదని, కొంత సమయం పాటు సేవలు స్తంభించాయని మాత్రమే తెలిపింది. దీనిపై ఎఫ్బీఐ, సీక్రెట్ సర్వీస్ అండ్ నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టాయి.