: పిల్లలు స్థిమితంగా కూర్చోలేకపోతున్నారా?


కొందరు పిల్లలు ఎక్కువ సేపు స్థిరంగా కూర్చోలేకపోతుంటారు. అందుకు కారణం... అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్ డీ). దశాబ్దకాలంగా పిల్లల్లో ఎక్కువగా గుర్తించిన రుగ్మతల్లో ఇదీ ఒకటని చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ జిరాక్ మార్కర్ తెలిపారు. అయితే, స్థిమితంగా కూర్చోలేని, హైపర్ యాక్టివ్ గా ఉండే అందరు చిన్నారులు ఏడీహెచ్ డీ తో బాధపడుతున్నారని భావించలేమని అభిప్రాయపడ్డారు. ఆధునిక యుగంలోనూ ఇలాంటి రుగ్మతల పట్ల పొరబడుతున్నారని, వీటిని మెడికల్ సమస్యల కిందే పరిగణిస్తున్నారని మార్కర్ వివరించారు. కాగా, విద్యా విధానంలో మార్పు ఇలాంటి రుగ్మతలతో బాధపడుతున్న చిన్నారులకు మేలు చేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. క్లాసుల మధ్య ఎక్కువ సార్లు స్వల్ప విరామం ఇవ్వడం ద్వారా ఇలాంటి పిల్లలకు ఊరటనివ్వచ్చని వివరించారు.

  • Loading...

More Telugu News