: సమ్మె ఎందుకు చేస్తున్నారో జూడాలకే తెలియదు: తెలంగాణ వైద్యశాఖ మంత్రి రాజయ్య


జూనియర్ డాక్టర్ల సమ్మెపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య స్పందించారు. అసలు సమ్మె ఎందుకు చేస్తున్నారో జూడాలకే తెలియదని ఆయన బుధవారం వ్యాఖ్యానించారు. జూనియర్ డాక్టర్లు సహాయకులు మాత్రమేనని, అయినప్పటికీ వారికి అసిస్టెంట్ సివిల్ సర్జన్లతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు జూడాలతో చర్చలు నిర్వహించామని, వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అయినా జూడాలు సమ్మెను కొనసాగిస్తుండటం సరికాదని మంత్రి అన్నారు. తక్షణమే విధులకు హాజరుకాకపోతే జూడాలపై చట్టపరంగా చర్యలకు వెనుకాడబోమని మంత్రి స్పష్టం చేశారు. గ్రామీణ వైద్య సేవలకు హాజరుకాబోమని జూడాలు చెప్పడం బాధాకరమని అన్నారు.

  • Loading...

More Telugu News